భారతదేశం, మార్చి 9 -- టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వెలుపల ఒక ఆసక్తికర సీన్ కనిపించింది. ప్రముఖ మలయాళ నటుడు, దర్శకుడు బేసిల్ జోసెఫ్ (పొన్‌మ్యాన్ ఫేమ్) ఒక సామాన్య క్రికెట్ అభిమానిలా మారిపోయి సందడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

స్టేడియం బయట పండుగ వాతావరణం నెలకొన్న వేళ.. మలయాళం స్టార్ బేసిల్ జోసెఫ్ రోడ్డు పక్కన ఉన్న ఒక స్టాల్‌ దగ్గర ఆగాడు. తన అత్యంత సన్నిహితుడు, భారత క్రికెటర్ సంజూ శాంసన్ పేరు ముద్రించి ఉన్న టీ-షర్ట్‌ను కొనుగోలు చేశాడు. ఆ జెర్సీని గర్వంగా కెమెరాకు చూపిస్తూ అతడు చిరునవ్వులు చిందించాడు. చుట్టూ ఉన్న యువత అతన్ని గుర్తుపట్టి సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపించారు.

అంతేకాకుండా స్టేడియం లోపలికి వెళ్లే ముందు బేసిల్ తన బుగ్గలపై భారత త్రివర్ణ ...