భారతదేశం, అక్టోబర్ 9 -- ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం 'మహీంద్రా అండ్ మహీంద్రా' తమ పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 'ఎక్స్‌యూవీ 3ఎక్స్​ఓ' పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 15న ఒక కొత్త ప్రొడక్ట్‌ను మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు కంపెనీ ఇటీవల ఒక టీజర్ ద్వారా సంకేతాలు ఇచ్చింది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఇది ఎక్స్‌యూవీ 3XO సీఎన్జీ వేరియంట్‌గా వాహన రంగ నిపుణులు భావిస్తున్నారు.

2024లో భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్​ఓ, తక్కువ సమయంలోనే అద్భుతమైన అమ్మకాలతో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ కారులో పెట్రోల్, డీజిల్, పూర్తి ఎలక్ట్రిక్ (ఈవీ) ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ సీఎన్జీ కిట్‌ను జోడించడం ద్వారా ఇది కంపెనీ లైన్-అప్‌లోనే కాకుండా, విభాగంలోనే అత్యధిక పవర్‌ట్రెయిన్ ఆప్షన్...