భారతదేశం, ఆగస్టు 10 -- భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి సరికొత్త వాహనాలను తీసుకురావడంలో ఎప్పుడూ ముందుండే ప్రముఖ దేశీయ దిగ్గజం 'మహీంద్రా అండ్ మహీంద్రా' మరోసారి సంచలనానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే మార్కెట్లో స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్ హవా నడుస్తుండగా, ఇప్పుడు ఆ కంపెనీ మరింత ఉత్సాహంగా అడుగులు వేస్తోంది. రాబోయే స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15) సందర్భంగా రెండు సరికొత్త ఎస్‌యూవీలను పరిచయం చేసేందుకు రంగం సిద్ధమైంది. వాటిలో ఒకటి కాంపాక్ట్ ఎస్‌యూవీ కాగా, మరొకటి సరికొత్త ఎలక్ట్రిక్ కారు. ప్రస్తుతం రోడ్లపై రకరకాల టెస్టింగ్ దశల్లో ఉన్న ఈ రెండు మోడళ్లపై ఆటోమొబైల్ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వాటి గురించి ఇక్కడ తెలుసుకోండి..

టెస్టింగ్ దశ చివరి అంకానికి చేరుకున్న మహీంద్రా విజన్ ఎస్ మోడల్ ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో మార్కెట్లోకి అడుగు...