భారతదేశం, జూలై 30 -- భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎస్‌యూవీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్ ఫొటోలు ఆన్​లైన్​లో లీక్ అయ్యాయి. వచ్చే నెలలోనే భారత రోడ్లపైకి అడుగుపెట్టనున్న ఈ కొత్త వర్షన్‌కు సంబంధించిన ఫోటోలు చూస్తుంటే.. ఇందులో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో స్పష్టత వచ్చేసింది. ఎక్స్​టీరియర్​లో చిన్నపాటి సరిదిద్దుబాట్లే చేసినప్పటికీ, కారు ఇంటీరియర్ మాత్రం మహీంద్రా భారీ స్థాయిలో టెక్ అప్‌గ్రేడ్స్ చేసినట్లు తెలుస్తోంది.

లీక్ అయిన ఫొటోలను గమనిస్తే.. స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్‌లో పెద్దగా విప్లవాత్మక మార్పులేవీ చేయలేదని అర్థమవుతోంది. ప్రస్తుత మోడల్‌లోని గంభీరమైన లుక్‌ను అలాగే కాపాడారు. ఒక ప్రధాన మార్పు ఏంటంటే, ఇందులో అందించిన నూతన మోడ్రన్ అల్లాయ్ వీల్స్. ఇవి కారు సైడ్ ప్రొఫైల్‌కు కొత్త రూపును ఇచ్చాయి.

ముందు...