భారతదేశం, ఆగస్టు 9 -- Mahesh Babu Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే (ఆగస్టు 9) సర్ ప్రైజ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'వారణాసి'లో మహేష్ బాబును అత్యంత శక్తివంతమైన 'రుద్ర' అనే పాత్రలో పరిచయం చేస్తున్నారు. మహేష్ బాబు బర్త్‌డే సందర్భంగా రుద్ర పాత్ర స్టిల్స్ ను రిలీజ్ చేశారు.

ఇవాళ మహేష్ బాబు బర్త్ డే సందర్బంగా వారణాసి నుంచి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. మహేష్ బాబు రెండు ఫొటోలను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. ఈ స్టిల్స్‌లో మహేష్ బాబు ఎంతో రిలాక్స్‌డ్ మోడ్‌లో ఉన్నప్పటికీ, అతని కళ్లల్లో ఒక విధమైన ఇంటెన్సిటీ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఫొటోలు వెంటనే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మహేష్ బాబు బర్త్ డే రోజు వారణాసి మూవీ నుంచి వచ్చిన ఫొటోలు ఫ్యాన్స్ కు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. కానీ వీడియో గ్లింప్స్ కోసం ...