భారతదేశం, ఏప్రిల్ 28 -- Mahesh Babu: ఎస్ఎస్ రాజమౌళి- మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక సినిమా 'వారణాసి'. రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ చేస్తున్న ఫస్ట్ మూవీ ఇది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా హైప్ నెలకొంది. ఈ నేపథ్యంలో ఇలాంటి బిగ్ ప్రాజెక్ట్ తర్వాత మహేష్ చేయబోయే మూవీ ఏంటీ? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

వారణాసి మూవీతో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ ను షేక్ చేయాలని మహేష్ బాబు టార్గెట్ పెట్టుకున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ 7, 2027న రిలీజ్ కానుంది. మరి ఆ తర్వాత మహేష్ చేయబోయే సినిమాల విషయంపై ఇప్పటి నుంచే డిస్కషన్ సాగుతోంది. ఇప్పుడీ విషయమే ట్రెండింగ్ టాపిక్ గా మారింది.

వారణాసి తర్వాత మహేష్ బాబు మూవీ లైనప్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. ఈ సూపర్ స్టార్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలను లైన్ లో పెట్టారనే...