భారతదేశం, జూలై 14 -- Mahesh Babu Jayakrishna: టాలీవుడ్‌లో తిరుగులేని ఘన వారసత్వాన్ని కలిగి ఉన్న కుటుంబాలలో ఘట్టమనేని ఫ్యామిలీ ఒకటి. ఇప్పుడు ఈ సామ్రాజ్యం నుంచి మూడో తరం వారసుడిగా వెండితెరకు పరిచయమవుతున్నాడు జయకృష్ణ ఘట్టమనేని. దివంగత నటుడు, నిర్మాత రమేష్ బాబు కుమారుడైన జయకృష్ణ లీడ్ రోల్‌లో ఎంట్రీ ఇస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ 'శ్రీనివాస మంగాపురం'.

తెలుగు చిత్రసీమలో సెంటిమెంట్లకు, లక్కీ లొకేషన్లకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఘట్టమనేని కుటుంబానికి గుంటురు జిల్లాలోని తమ స్వగ్రామం బుర్రిపాలెం అంటే ఒక ఎమోషనల్ బాండింగ్. గతంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా పరిచయమైన బ్లాక్‌బస్టర్ మూవీ 'రాజకుమారుడు' ప్రమోషన్ల ప్రచారాన్ని అప్పట్లో సరిగ్గా ఇదే గ్రామం నుంచే అధికారికంగా ప్రారంభించారు.

రాజకుమారుడు సినిమా అప్పట్లో ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో త...