భారతదేశం, జూలై 28 -- Mahesh Babu: ఘట్టమనేని కాంపౌండ్ నుంచి మరొక యంగ్ హీరో వెండితెరకు పరిచయమవుతున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, దివంగత రమేష్ బాబు తనయుడు జయకృష్ణ ఘట్టమనేని (Jayakrishna Ghattamaneni) కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం 'శ్రీనివాస మంగాపురం' (Srinivasa Mangapuram). అయితే అన్న కొడుకు సినిమాకు మహేష్ బాబు సపోర్ట్ లేదనే రూమర్లు వచ్చాయి.

'ఆర్‌ఎక్స్ 100', 'మంగళవారం' వంటి వైవిధ్యమైన చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న అజయ్ భూపతి (Ajay Bhupathi) శ్రీనివాస మంగాపురం చిత్రానికి డైరెక్చటర్. ఈ సినిమా జూలై 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఒక్క ఫొటోతో మహేష్ బాబు సపోర్ట్ లేదనే రూమర్లకు మూవీ టీమ్ చెక్ పెట్టింది.

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఒక ప్రచారం గట్టిగా సాగింది. ఇప్...