భారతదేశం, ఏప్రిల్ 19 -- Mahavatar Parshuram: మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ (ఎంసీయూ)లో మరో భారీ ప్రాజెక్ట్ రాబోతుంది. మహావతార్ నరసింహతో సంచలనం క్రియేట్ చేసిన హోంబలే ఫిల్మ్స్ ఇప్పుడు పరశురాముడి కథతో సినిమాను తీసుకొస్తుంది. ఈ యానిమేటెడ్ మూవీ టైటిల్ మోషన్ పోస్టర్ ను ఆదివారం (ఏప్రిల్ 19) రిలీజ్ చేశారు.

మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ లో రాబోతున్న రెండో సినిమా ఏంటో తెలిసిపోయింది. విష్ణు దశావతారాల్లో ఒకటైన పరశురామ అవతారం కథతో 'మహావతార్ పరశురామ్' సినిమాను తీసుకు రాబోతున్నారు. ఈ మేరకు ఇవాళ హోంబలే ఫిల్మ్స్ టైటిల్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ తెగ వైరల్ గా మారింది.

మహావతార్ పరశురామ్ టైటిల్ మోషన్ పోస్టర్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. గండ్ర గొడ్డలి చేతబట్టి దుష్ట శిక్షణ చేసే ఉగ్రరూపంలో పరశురాముడి అవతారాన్ని పవర్ ఫుల్ గా చూపించారు. ''ధర్మం...