భారతదేశం, అక్టోబర్ 21 -- Mahasakthi Trailer: లేడీ సూపర్‌స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ డివోషనల్ ఫాంటసీ మూవీ 'మహాశక్తి' (మూకుతి అమ్మన్ 2) ట్రైలర్ ఈ రోజు విడుదలైంది. పాపులర్ దర్శకుడు సుందర్ సి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 2020లో వచ్చిన 'మూకుతి అమ్మన్' (తెలుగులో అమ్మోరు తల్లి) చిత్రానికి సీక్వెల్. మహాశక్తి లేటెస్ట్ ట్రైలర్ లో మాత్రం నెక్స్ట్ లెవల్ లో ఉందని చెప్పొచ్చు.

మూకుతి అమ్మన్ మూవీకి సీక్వెల్ గా ఈ మహాశక్తి మూవీ తెరకెక్కుతోంది. 2020లో వచ్చిన ఫస్ట్ మూవీ మూకుతి అమ్మన్ సోషల్ మెసేజ్, కామెడీ ప్రధానంగా సాగగా.. ఈ సెకండ్ పార్ట్ మాత్రం హాలీవుడ్ రేంజ్ విజువల్స్, మైథలాజికల్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందింది.

ట్రైలర్‌లో లేడీ సూపర్‌స్టార్ నయనతార దైవిక అవతారంలో తన విశ్వరూపాన్ని చూపించింది. అమ్మవారిగా ఆమె పవర్‌ఫుల్ ల...