భారతదేశం, జూన్ 1 -- Madhuri Dixit Maa Behen on Netflix: నటనతోపాటు అద్భుతమైన డ్యాన్స్‌తో నార్త్ నుంచి సౌత్ వరకు కోట్లాది మంది గుండెల్లో స్థానం సంపాదించుకున్న 'ధక్ ధక్' గర్ల్ మాధురీ దీక్షిత్ డిజిటల్ స్క్రీన్‌పై సందడి చేయడానికి సిద్ధమయ్యారు. సురేష్ త్రివేణి దర్శకత్వంలో ఆమె నటించిన సరికొత్త మూవీ 'మా బెహన్' నేరుగా ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) జూన్ 4న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తన సుదీర్ఘ కెరీర్, ఈ సినిమాలో తన రోల్, కామెడీ చేయడంలో ఉన్న ఛాలెంజెస్ గురించి మాధురి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు.

ఈ సినిమాలో మాధురి దీక్షిత్ గతంలో ఎన్నడూ చూడని సరికొత్త అవతారంలో కనిపించనున్నారని సహనటుడు రవికిషన్ ఇప్పటికే ఒక హింట్ ఇచ్చారు. 59 ఏళ్ల వయసులో కూడా ఇంత వెరైటీగా ఉండే పాత్రలు రావడంపై మాధురి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.

"నాలుగ...