భారతదేశం, మే 8 -- Madhavan: సినీ పరిశ్రమలో చాక్లెట్ బాయ్‌గా, విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆర్.మాధవన్ తన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా తన కుమారుడు వేదాంత్ ఎదుగుదల వెనుక ఉన్న పేరెంటింగ్ సీక్రెట్స్ పంచుకున్నాడు. సెక్స్, కండోమ్ వాడకం గురించి కూడా తన కొడుకుతో మాట్లాడతానని మాధవన్ షాకింగ్ విషయాలు చెప్పాడు. ఇప్పుడు ఇది నెట్టింట చర్చనీయాంశమైంది.

ప్రముఖ తమిళ పత్రిక 'కుముదం'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాధవన్ తన పేరెంటింగ్ శైలి గురించి కీలక విషయాలు వెల్లడించాడు. వేదాంత్ చాలా చిన్న వయసులో ఉన్నప్పటి నుంచే తను అతడిని ఒక పిల్లాడిలా కాకుండా, ఒక పరిణతి చెందిన వ్యక్తిలా భావించేవాడినని మాధవన్ చెప్పాడు.

"నా కొడుకుకు నాలుగేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే నేను తనతో ప్రతి విషయాన్ని స్వేచ్ఛగా మాట్లాడటం మొదలుపెట్టా. లైంగిక స్పర్శ (Sexual touch), ఎదుటివారికి ఇవ్వాల్సిన ...