భారతదేశం, ఏప్రిల్ 6 -- కొంతమంది వాహనాదారులు. వారి నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో అమాయకుల ప్రాణాలను తీస్తున్నారు. తప్పతాగి వాహనాలను నడపటం, ర్యాష్ డ్రైవింగ్ వంటివి చేస్తూ. ఇతరుల జీవితాలను రిస్క్ లో పడేస్తున్నారు. పోలీసులు నిత్యం హెచ్చరిస్తున్నప్పటికీ.. ఏదో ఒక చోట విషాద ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ లోని మాదాపూర్ లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం.ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది.

ప్రాథమిక వివరాల ప్రకారం.. మాదాపూర్ మీదుగా అయేషా(22), అబ్దుల్ బాసిత్ అనే దంపతులు స్కూటీపై వెళ్తున్నారు. ఈ క్రమంలోనైే మైండ్ స్పేస్ వద్ద వీరి స్కూటీని. డీసీఎం వెనక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టింది. స్కూటీ డీసీఎం కిందికి వెళ్లిపోయింది. ప్రమాద తీరును గమనించిన డీసీఎం డ్రైవర్. కనీసం కిందికి కూడా దిగలేదు. డీసీఎంను ఆపకుండా కిలో మీటర్ మేర అలానే లాక్కుని వెళ్లి తప్పించుకునే ప్రయత్...