భారతదేశం, ఫిబ్రవరి 28 -- బిగ్ బాస్ తో తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసే స్టార్ మా మరో కొత్త రియాలిటీ షోతో రెడీ అవుతోంది. ప్రేక్షకులకు మరింత ఎంటర్ టైన్మెంట్ అందించేందుకు రాబోతుంది. బిగ్ బాస్ లాంటి కాన్సెప్ట్ తోనే, కానీ సింగిల్ గా కాకుండా ఈ సారి జోడీలతో అలరించబోతుంది. ఈ షోకు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ జడ్జీగా వ్యవహరిస్తున్నాడు.

ఒక ఇంట్లో 10 జంటలను పెట్టి, వీళ్ల మధ్య పోటీ పెట్టి ఎవరు బెస్ట్ అని నిర్ణయించడానికి ఒక కొత్త రియాలిటీ గేమ్ షోతో స్టార్ మా వచ్చేస్తోంది. 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' అనే పేరుతో ఈ షోను గ్రాండ్ గా లాంఛ్ చేయడానికి రెడీ అవుతోంది. ఈ షో అప్ డేట్స్ ను సోషల్ మీడియాలో పంచుకుంటున్న స్టార్ మా మంచి బజ్ క్రియేట్ చేస్తోంది.

మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో గురించి ఇప్పటికే టాప్ యాంకర్ శ్రీముఖితో అనౌన్స్ మెంట్ చేసేశారు. ఇప్పుడిక ఈ రి...