భారతదేశం, జూలై 16 -- Maa Inti Bangaram OTT: స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన 'మా ఇంటి బంగారం' ఇంకొన్ని గంటల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రేక్షకుల నిరీక్షణకు ఎండ్ కార్డు వేస్తూ ఈ రోజు రాత్రి 12 గంటల నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు రానుంది. ఈ నేపథ్యంలో, ఈ బ్లాక్‌బస్టర్ సినిమాను ఓటీటీలో ఎందుకు అస్సలు మిస్ అవ్వకూడదో వివరించే ఐదు బలమైన కారణాలు ఇక్కడ చూద్దాం.

తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలోనే మా ఇంటి బంగారం సినిమా ఒక సరికొత్త మైలురాయిని అధిగమించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి, టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన మొదటి మహిళా ప్రధాన (Female-led) చిత్రంగా ఇది చారిత్రాత్మక రికార్డు సృష్టించింది. కేవలం సమంత స్టార్ పవర్‌తోనే ఈ స్థాయి వసూళ్లు రావడం విశేషం.

ఆరోగ్య కా...