భారతదేశం, జూన్ 22 -- Maa Inti Bangaram Collections: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు లేటెస్ట్ మూవీ 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా, ఓపెనింగ్ వీకెండ్ లో అద్భుతమైన వసూళ్లను సాధించింది. ముఖ్యంగా ఆదివారం (జూన్ 21) నాడు ఈ సినిమా థియేటర్లలో భారీ వసూళ్లను రాబట్టింది.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, కేవలం మూడు రోజుల్లోనే మా ఇంటి బంగారం సినిమా ఇండియా వైడ్ నెట్ కలెక్షన్లలో రూ.23.10 కోట్ల మార్కును దాటేసింది. దాదాపు మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సమంత వెండితెరపైకి రీఎంట్రీ ఇవ్వడంతో అభిమానులు, కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.

ప్రముఖ బాక్సాఫీస్ ట్రాకర్ 'శాక్నిల్క్' (Sacnilk) అందించిన తాజా గణాంకాల ప్రకారం.. 'మా ఇంటి బంగారం' చిత...