భారతదేశం, సెప్టెంబర్ 9 -- Lust Stories 3 Trailer: ప్రేమ, బంధాలు, కోరికలు, ఎమోషనల్ డ్రామాను బోల్డ్‌గా ఆవిష్కరించిన నెట్‌ఫ్లిక్స్ బ్లాక్‌బస్టర్ ఫ్రాంచైజ్ 'లస్ట్ స్టోరీస్' నుంచి మూడో పార్ట్ వచ్చేస్తోంది. ప్రముఖ దర్శక నిర్మాతలు విక్రమాదిత్య మోట్వానే, కిరణ్ రావు, శకున్ బాత్రా, విశాల్ భరద్వాజ్‌లు సంయుక్తంగా తెరకెక్కించిన 'లస్ట్ స్టోరీస్ 3' ట్రైలర్‌ను నెట్‌ఫ్లిక్స్ ఇవాళ (సెప్టెంబర్ 9) రిలీజ్ చేసింది.

లస్ట్ స్టోరీస్ 3 ట్రైలర్ లో విభిన్న సామాజిక నేపథ్యాలు కలిగిన నలుగురు వ్యక్తుల జీవితాలలో కోరికలు, పెళ్లి జీవితం, కామెడీని చూపించారు. లస్ట్ స్టోరీస్ ఫ్రాంఛైజీ లెగసీని కొనసాగిస్తూ ఈ మూడో సీజన్ కూడా నాలుగు కథల ఆంథాలజీ బోల్డ్ మూవీగా తెరకెక్కింది. ఇందులో రియల్ లైఫ్ కపుల్ అదితి రావు హైదరీ, సిద్ధార్థ్ కలిసి రొమాన్స్ చేయడం గమనార్హం.

లస్ట్ స్టోరీస్ ట్రైలర్ ...