భారతదేశం, మే 30 -- జ్యేష్ట మాసంలో వచ్చే ఈ పున్నమి తిథికి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది అధిక మాస పూర్ణిమ కలయిక రెండు రోజుల పాటు ఉండటం విశేషం. హిందూ పంచాంగం ప్రకారం.. జ్యేష్ట మాస శుక్ల పక్ష పూర్ణిమ తిథి మే 30వ తేదీ ఉదయం 11:58 గంటలకు ప్రారంభమై, మే 31వ తేదీ మధ్యాహ్నం 02:14 గంటల వరకు కొనసాగుతుంది. అయితే ఈ ఏడాది జ్యేష్ట పూర్ణిమ వేళ ఒక అరుదైన ఖగోళ సంఘటన చోటుచేసుకోబోతోంది. మే 31వ తేదీన ఆకాశంలో 'బ్లూ మూన్' అద్భుత దృశ్యం కనువిందు చేయనుంది. చంద్రుడు వృశ్చిక రాశిలో సంచరిస్తున్న సమయంలో ఈ పూర్ణిమ రావడం వల్ల దీనిని 'స్కార్పియో బ్లూ మూన్' అని పిలుస్తున్నారు.

జ్యోతిష్య శాస్త్ర విశ్లేషణ ప్రకారం.. ఈ స్కార్పియో బ్లూ మూన్ ప్రభావం అన్ని రాశులపై ఉన్నప్పటికీ, మూడు రాశుల వారికి మాత్రం విశేషమైన లాభాలు కలగనున్నాయి. ఆ రాశుల జాతకాల్లో వెలుగులు నిండనున్...