భారతదేశం, ఏప్రిల్ 20 -- Live-in Relationship Safety Tips : నేటి మారుతున్న జీవనశైలిలో 'సహజీవనం' లేదా 'లివ్-ఇన్ రిలేషన్‌షిప్' ఒక కొత్త సామాజిక మార్పుగా మారింది. అయితే, వివాహంతో సంబంధం లేకుండా ఒకే ఇంట్లో కలిసి ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు భావోద్వేగాలతో పాటు భద్రత, చట్టపరమైన అంశాలపై అవగాహన ఉండటం చాలా కీలకం.

పెళ్లి చేసుకోకుండానే ఒకే ఇంట్లో దంపతుల్లా కలిసి ఉండటాన్ని 'లివ్-ఇన్ రిలేషన్‌షిప్' (సహజీవనం) అంటారు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, ఆర్థిక భారాన్ని పంచుకోవడానికి లేదా వ్యక్తిగత స్వేచ్ఛ కోసం నేటి తరం యువత ఈ మార్గాన్ని ఎంచుకుంటోంది. అయితే, ఈ బంధంలో ఎటువంటి సామాజిక లేదా చట్టపరమైన పత్రాలు (పెళ్లి పత్రికలు లేదా రిజిస్ట్రేషన్) ఉండవు కాబట్టి, ఇందులో రిస్క్ కూడా ఎక్కువే. అందుకే, సహజీవనం చేసే జంటలు, ముఖ్యంగా మహిళలు కొన్ని భద్రతా సూత్రాలను పాటించాల...