భారతదేశం, జూలై 1 -- సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 452 పాయింట్లు పడి 83,606 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 121 పాయింట్లు పతనమై 25,517 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 131 పాయింట్లు పడి 57,313 వద్దకు చేరింది.

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 787.62 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,383.01 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 20 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

"నిఫ్టీ50 షార్ట్​ టర్మ్​లో కన్సాలిడేట్​ అవ్వొచ్చు. 25,500 దిగువకు పడితే కరెక్షన్​ కనిపించవచ్చు. 25,6000 25,800 వద్ద రెసిస్టెన్స్​ ఎదురవ్వొచ్చు," అని ఎల్...