భారతదేశం, జూలై 10 -- Lenin Review:

సినిమా పేరు : లెనిన్

నటీనటులు : అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే, ఈశ్వరీ రావు, ప్రమోద్ పంజు, బ్రహ్మాజీ, శివాజీ, సునీల్ తదితరులు

డైరెక్టర్ : మురళీ కిశోర్ అబ్బూరు

ప్రొడ్యూసర్లు : అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ

రిలీజ్ డేట్ : జూలై 10, 2026

ఇది మా మహా భారతం కథ అంటూ థియేటర్లకు వచ్చిన సినిమా 'లెనిన్'. అక్కినేని అఖిల్ (Akhil Akkineni) కెరీర్‌లో అత్యధిక కాలం వేచి చూసిన ప్రాజెక్ట్ ఇది. 'ఏజెంట్' తర్వాత దాదాపు మూడేళ్ల గ్యాప్ తీసుకుని, పక్కా ప్లానింగ్‌తో అఖిల్ చేసిన మాస్ అండ్ క్లాస్ ఎంటర్‌టైనర్ ఇది. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంపై మొదటి నుంచి అంచనాలు గట్టిగానే ఉన్నాయి. మరి ఈ రోజు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో లెనిన్ రివ్యూలో చూద్దాం.

లెనిన్ కథ అంతా 1989 కాలంలో చిత్...