భారతదేశం, జూలై 13 -- Lenin Box Office Collection: కెరీర్ స్టార్టింగ్ నుంచి ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ కోసం వెయిట్ చేస్తున్న అఖిల్ అక్కినేని ఎట్టకేలకు 'లెనిన్' మూవీతో బాక్సాఫీస్ దగ్గర విశ్వరూపం చూపిస్తున్నాడు. మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్షన్‌లో వచ్చిన ఈ పీరియడ్ రూరల్ రివెంజ్ డ్రామా థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు.

రిలీజ్ రోజే సెన్సేషనల్ టాక్ తెచ్చుకున్న లెనిన్ సినిమా.. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి తన దూకుడును కంటిన్యూ చేస్తోంది. ట్రేడ్ పండితుల అంచనాలను తలకిందులు చేస్తూ 'లెనిన్' కేవలం మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.61.1 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి టాలీవుడ్ రికార్డులను షేక్ చేస్తోంది.

ఇక్కడ ఇంకో మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. రెగ్యులర్ టికెట్ రేట్స్ ఉన్నప్పటి...