భారతదేశం, సెప్టెంబర్ 5 -- Legacy Release Date: 'మాస్ కా దాస్' విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న సరికొత్త చిత్రం 'లెగసీ' (LEGACY). ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ను 2026 డిసెంబర్ 4న థియేటర్లలో భారీగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ రూట్ మార్చాడు. ఇప్పుడు పొలిటికల్ థ్రిల్లర్ తో థియేటర్లకు రాబోతున్నాడు. అతని అప్ కమింగ్ మూవీ 'లెగసీ' రిలీజ్ డేట్ ను ఇవాళ (సెప్టెంబర్ 5) ప్రకటించారు. ఇందులో విశ్వక్ సేన్ కు జోడీగా ఏక్తా రాథోడ్ హీరోయిన్ గా నటిస్తోంది.

లెగసీ రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఈ పోస్టర్ లో ఒక్కో గుర్రంపై ఉన్న హీరో, హీరోయిన్ లిప్ కిస్ పెట్టుకుంటున్నారు. ఈ పోస్టర్ మూవీ లవర్స్‌ను ఆ...