భారతదేశం, నవంబర్ 28 -- Legacy Release: గత కొంతకాలంగా వరుస సినిమాలతో ప్రయోగాలు చేస్తూ వస్తున్న విశ్వక్ సేన్‌కు 'ఈఎన్‌ఈ రిపీట్' రూపంలో భారీ విజయం దక్కింది. నవంబర్ 19న విడుదలైన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.

ఈఎన్ఈ రిపీట్ బ్లాక్‌బస్టర్ సక్సెస్‌తో విశ్వక్ సేన్ కెరీర్‌కు కొత్త ఊపు వచ్చింది. తన కెరీర్ కు అవసరమైన హిట్ ను ఈ నగరానికి ఏమైంది 2 మూవీ అందించింది. ఇప్పుడు అదే విజయ పరంపరను ఆయన తన తదుపరి చిత్రం 'లెగసీ'తోనూ కొనసాగిస్తాడా అనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది.

ఈఎన్‌ఈ రిపీట్ ఇచ్చిన ఉత్సాహంలో ఉన్న విశ్వక్ సేన్ అభిమానులకు మరో క్రేజీ అప్‌డేట్ అందింది. ఆయన హీరోగా నటిస్తున్న 'లెగసీ' షూటింగ్ మొత్తం అధికారికంగా పూర్తయినట్లు చిత్ర బృందం ప్రకటించింది. షూటింగ్ ముగ...