భారతదేశం, ఏప్రిల్ 6 -- చెన్నైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, 'ది లెజెండ్' ఫేమ్ శరవణన్ అరుల్ (లెజెండ్ శరవణన్) హీరోగా నటించిన తాజా మూవీ 'లీడర్' (Leader). ఆర్.ఎస్. దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ పొలిటికల్ యాక్షన్ డ్రామా ఇటీవల థియేటర్లలోకి వచ్చింది.

పాయల్ రాజ్‌పుత్ కథానాయికగా నటించిన ఈ సినిమా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోలింగ్‌కు గురవుతోంది. దీనికి ప్రధాన కారణం చిత్ర యూనిట్ విడుదల చేసిన కలెక్షన్ల పోస్టర్.

సినిమా విడుదలైన మొదటి వీకెండ్ 'లీడర్' ప్రపంచవ్యాప్తంగా రూ. 25 కోట్లు గ్రాస్ వసూలు చేసిందని, త్వరలోనే రూ. 100 కోట్ల క్లబ్‌లోకి చేరుతుందని సినిమా యూనిట్ ఒక పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేసింది. అయితే ట్రేడ్ విశ్లేషకులు, బాక్సాఫీస్ వెబ్‌సైట్ల లెక్కలు దీనికి పూర్తి భిన్నంగా ఉన్నాయి.

ప్రముఖ బాక్సాఫీస్ ట...