భారతదేశం, జూన్ 18 -- Lagaan OTT: ఇండియన్ సినిమా చరిత్రలోనే కాకుండా.. క్రికెట్, సినిమా లవర్స్ గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే ఒక అద్భుతమైన దృశ్య కావ్యం 'లగాన్' (Lagaan). మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ లీడ్ రోల్‌లో, డైరెక్టర్ అశుతోష్ గోవారికర్ తెరకెక్కించిన ఈ కల్ట్ క్లాసిక్ మూవీ విడుదలై అప్పుడే 25 ఏళ్లు పూర్తి చేసుకుంది.

ఈ సిల్వర్ జూబ్లీ మైల్‌స్టోన్‌ను సెలబ్రేట్ చేసుకుంటూ మేకర్స్ ఈ చిత్రాన్ని జూన్ 12న థియేటర్లలో గ్రాండ్‌గా రీ రిలీజ్ చేశారు. కొత్త తరం ప్రేక్షకులతో పాటు పాత తరం ఆడియన్స్ కూడా ఈ 3 గంటల 44 నిమిషాల సినిమాను థియేటర్లలో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇంతటి ఘనచరిత్ర ఉన్న ఈ సినిమా ప్రస్తుతం ఇండియాలో ఏ ఒక్క ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్‌లోనూ డిజిటల్ స్ట్రీమింగ్‌కు అందుబాటులో లేకపోవడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారి...