భారతదేశం, ఆగస్టు 4 -- Kushboo Udayanidhi: తంజావూరులో జరిగిన ఒక బహిరంగ సభలో తమిళనాడు మాజీ డిప్యూటీ సీఎం, నటుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దక్షిణాది సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు విజయ్‌ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతూ.. నటి త్రిష కృష్ణన్ పేరును ప్రస్తావిస్తూ ఉదయనిధి చేసిన "డబుల్ మీనింగ్" వ్యాఖ్యలపై నెటిజన్లు, పలువురు ప్రముఖులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనపై ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ (Khushbu Sundar) సోషల్ మీడియా వేదికగా అత్యంత ఘాటుగా స్పందించారు. ఉదయనిధి ప్రసంగాన్ని 'చీప్, దిగజారిన రాజకీయ సంస్కృతి'గా అభివర్ణించారు. తన సోషల్ మీడియా ఖాతాలో మహిళా పరాశక్తిగా ఉన్న దేవుని ఫోటోను షేర్ చేస్తూ, ఉదయనిధి వైఖరిని ఖుష్బూ సుందర్ తప్పుబట్టారు.

''ఉదయనిధి స్టాలిన్ ప్రసం...