భారతదేశం, సెప్టెంబర్ 11 -- KTR Prabhas: పిల్లల ముచ్చట తీర్చడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) టాలీవుడ్ స్టార్లకు వరుసగా ఫోన్ కొట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 'ది అండర్ 18 వరల్డ్' అనే టాక్ షోలో పాల్గొన్న కేటీఆర్.. ప్రభాస్, మహేష్ బాబు, నాని లాంటి డార్లింగ్స్‌కు లైవ్‌లోనే ప్రాంక్ కాల్స్ చేశారు. మొదట ఎవరూ లిఫ్ట్ చేయకపోయినా, ఆ తర్వాత గ్లోబల్ స్టార్ ప్రభాస్ నుంచి వచ్చిన రిటర్న్ కాల్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది.

'ది అండర్ 18 వరల్డ్' షోకి గెస్ట్‌గా వచ్చిన కేటీఆర్ పిల్లలతో చాలా సరదాగా గడిపారు. టాక్ షోలో భాగంగా బుడతలు కేటీఆర్‌ను ఒక క్రేజీ రిక్వెస్ట్ అడిగారు. తమకిష్టమైన టాలీవుడ్ హీరోలతో మాట్లాడించాలని పట్టుబట్టారు.

పిల్లల ముచ్చట కాదనలేక కేటీఆర్ వెంటనే తన ఫోన్ తీసి స్టార్ హీరోలకు వరసబెట్టి కాల్స్ చేయడం ప్రారం...