భారతదేశం, సెప్టెంబర్ 4 -- భారతీయ సంస్కృతిలో, హిందూ పండుగల్లో శ్రీకృష్ణ జన్మాష్టమికి ఉన్న విశిష్టత ప్రత్యేకమైనది. అజ్ఞానమనే చీకట్లను పారద్రోలి, ధర్మాన్ని పరిరక్షించేందుకు ద్వాపర యుగంలో శ్రావణ బహుళ అష్టమి తిథి నాడు, రోహిణీ నక్షత్రం వేళలో మధురలోని జైలులో శ్రీకృష్ణ భగవానుడు జన్మించాడు. 2026 సంవత్సరంలో సెప్టెంబర్ 4వ తేదీన శ్రీకృష్ణుడి 5252వ జయంతి ఉత్సవాలను దేశవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుపుకోవడానికి ఆలయాలు, గృహాలు ముస్తాబవుతున్నాయి.

ఈ రోజున భక్తులు ఉదయాన్నే నిద్రలేచి కృష్ణుడి విగ్రహాలను రంగురంగుల దుస్తులు, నెమలి పింఛాలు, తులసి మాలలతో అలంకరిస్తారు. రోజంతా ఉపవాసం ఉండి, అర్ధరాత్రి కృష్ణ జననం వేళ ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి, వెన్న, అటుకులు, పాయసం వంటి నైవేద్యాలను సమర్పిస్తారు. మరుసటి రోజున ఊరూరా ఉట్టి కొట్టే సంబరాలు మిన్నంటుతాయి.

దృక్ ప...