భారతదేశం, మే 13 -- Kirrak Seetha: బేబీ సినిమాతో క్రేజ్ సంపాదించుకున్న కిర్రాక్ సీత చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తన కెరీర్ స్టార్టింగ్ లో ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి ఆమె వెల్లడించింది. ఈ క్రమంలోనే సంచలన వ్యాఖ్యలు చేసింది. ఫామ్ హౌస్ కు రమ్మన్నారని, రూ.25 లక్షలు ఇస్తామన్నారని సీత చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి.

తాాజాగా ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో కిర్రాక్ సీత పాల్గొంది. ఈ సందర్భంగా గతంలో తనకు ఎదురైన ఓ అనుభవాన్ని ఈ బిగ్ బాస్ బ్యూటీ పంచుకుంది. ''7 ఆర్ట్స్ కోసం షూటింగ్ చేస్తున్నా. అప్పుడే నాకు ఓ కాల్ వచ్చింది. సినిమాలో ఆఫర్ ఉందని చెప్పారు. హ్యాపీగా ఫీల్ అయ్యా. అప్పుడు నాకు 21 లేదా 22 ఏళ్లు. మూవీలో యాక్టింగ్ చేస్తానని చెప్పా. కానీ నన్ను ఫామ్ హౌస్ కు రావాలని చెప్పారు'' అని సీత వెల్లడించింది.

''ఫామ్ హౌస్ కు రావాల...