భారతదేశం, జూలై 21 -- Kiran Abbavaram: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన నయా మూవీ 'చెన్నై లవ్ స్టోరీ' ప్రమోషన్లలో ఒక ఊహించని సంచలన విషయాన్ని రివీల్ చేశారు. మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్ హీరోగా రూ. 100 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'సంబరాల ఏటి గట్టు' (SYG) మొదట తన దగ్గరికే వచ్చిందని ఆసక్తికర నిజం బయటపెట్టారు. అయితే ఆ సినిమా బడ్జెట్ భారీగా పెరిగిపోవడం, తనతో అంత బడ్జెట్ మూవీ రిస్క్ అనే వదులుకున్నట్లు చెప్పడం విశేషం.

'ఎస్ఆర్ కళ్యాణమండపం' షూటింగ్ జరుగుతున్న టైమ్‌లోనే డైరెక్టర్ రోహిత్ కేపీ తనకు ఈ లైన్ చెప్పాడని కిరణ్ అబ్బవరం గుర్తుచేసుకున్నారు. మొదట కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్‌లో నార్మల్ సినిమాగా ప్లాన్ చేసిన ఈ కథను, డైరెక్టర్ విజన్ నచ్చి పెద్ద క్యాన్వాస్‌లో తెరకెక్కించాలని తానే సలహా ఇచ్చానని తెలిపారు.

'హనుమాన్...