భారతదేశం, ఆగస్టు 28 -- Kichcha Sudeep: 'కేజీఎఫ్' లాంటి గ్లోబల్ హిట్ తర్వాత బాక్సాఫీస్ దగ్గర ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధిస్తున్నప్పటికీ, రాకింగ్ స్టార్ యశ్ నయా మూవీ 'టాక్సిక్' (Toxic) తీవ్రమైన నెగెటివిటీ, సోషల్ మీడియా ట్రోల్స్ ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్ యశ్ కి మద్దతుగా నిలిచి సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ చేశారు. రొటీన్ కమర్షియల్ ఫార్ములా పక్కనపెట్టి రిస్క్ చేసిన యశ్ ధైర్యాన్ని ఆయన మనస్ఫూర్తిగా ప్రశంసించారు.

'కేజీఎఫ్' బ్లాక్‌బస్టర్ సక్సెస్ తర్వాత ఏ హీరో అయినా సేఫ్ జోన్‌లో రొటీన్ కమర్షియల్ ఫార్ములా సినిమా చేస్తాడని, కానీ యశ్ మాత్రం దానికి భిన్నంగా ఆలోచించాడని సుదీప్ పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా ఎక్స్ లో సుదీప్ ఒక సుదీర్ఘమైన ఎమోషనల్ మెసేజ్ షేర్ చేశారు.

"పాత కమర్షియల్ రూట్ ఎంచు...