భారతదేశం, ఆగస్టు 1 -- Kiara Advani Birthday: రాకింగ్ స్టార్ యశ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'టాక్సిక్' సినిమాలోని 'తబాహి' సాంగ్ రిలీజైనప్పటి నుంచి బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొంటోంది. పాటలో కియారా చేసిన బోల్డ్, ఇంటిమేట్ సీన్స్ కారణంగా ఆమెపై కొందరు నెటిజన్లు దారుణమైన కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. హద్దులు దాటిన ఈ వేధింపులు ఇప్పుడు ఆమె భర్త, స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా వరకు పాకాయి.

ఇటీవలే ఒక పాపకు జన్మనిచ్చి పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందిన ఈ క్యూట్ కపుల్‌పై కొందరు నెటిజన్లు హద్దుమీరి కామెంట్లు చేస్తుండటంతో ఇంటర్నెట్‌లోని సినిమా లవర్స్, ఫ్యాన్స్ కియారా-సిద్ధార్థ్ జంటకు మద్దతుగా నిలిచారు.

జులై 31న కియారా 33వ పుట్టినరోజు సందర్భంగా సిద్ధార్థ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్వీట్ పోస్ట్ షేర్ చేశారు. "నా...