భారతదేశం, మే 4 -- Kiara Advani: గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్'. ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుండి ఏదో ఒక వార్తతో నిరంతరం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. ఇప్పటికే మూడుసార్లు విడుదల తేదీ వాయిదా పడినప్పటికీ, ఈ చిత్రంపై ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.

తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న కియారా అద్వానీకి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో హల్‌చల్ చేసింది. యశ్ తో తాను నటించిన కొన్ని రొమాంటిక్ సీన్లను తొలగించమని కియారా కోరినట్లు ప్రచారం జరిగింది. దీనిపై కియారా అద్వానీ స్వయంగా స్పందిస్తూ పుకార్లకు చెక్ పెట్టారు.

టాక్సిక్ సినిమాలో యశ్, కియారా మధ్య కొన్ని ఘాటు రొమాంటిక్ సీన్లు ఉంటాయని, షూటింగ్ సమయంలో తన...