భారతదేశం, అక్టోబర్ 9 -- ఆటోమొబైల్ దిగ్గజం 'కియా ఇండియా' తమ కస్టమర్ల కోసం ఒక సంచలన స్కీమ్​ని అందుబాటులోకి తెచ్చింది. వాహనదారులకు రీసేల్ వ్యాల్యూపై స్పష్టమైన భరోసా కల్పిస్తూ.. తమ 'అస్యూర్డ్ బైబ్యాక్ ప్రోగ్రామ్'ను సరికొత్తగా విస్తరించింది. ఇకపై పెట్రోల్, డీజిల్ కార్లతో పాటు హైబ్రిడ్, ఎలక్ట్రిక్ (ఈవీ) వాహనాలకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది.

కొత్త కారు కొనేటప్పుడు దానికి భవిష్యత్తులో లభించే రీసేల్ వ్యాల్యూ గురించి ప్రతీ ఒక్కరూ ఆలోచిస్తారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విషయంలో బ్యాటరీ లైఫ్, రీసేల్ ధరపై కస్టమర్లలో అనేక సందేహాలు ఉంటాయి. వీటిని పటాపంచలు చేస్తూ కియా ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ ఎక్స్​ప్యాండెడ్ స్కీమ్ కింద పెట్రోల్, డీజిల్, సీఎన్జీ వాహనాలు కొనుగోలు చేసేవారికి 3 ఏళ్ల యాజమాన్య వ్యవధి తర్వాత కారు ధరలో 75 శాతం వరకు గ్...