భారతదేశం, ఫిబ్రవరి 28 -- ట్రైలర్ తోనే వివాదానికి ఆజ్యం పోసి, కోర్టు క్లియరెన్స్ తో థియేటర్లలోకి వచ్చిన కేరళ స్టోరీ 2 సినిమాకు షాకింగ్ ఓపెనింగ్ కలెక్షన్లు వచ్చాయి. ఫిబ్రవరి 27న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రాన్ని చూసేవాళ్లే కరవయ్యారు. మరోవైపు కేరళలో ఈ సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్ల ముందు ఆందోళనలు జరుగుతున్నాయి.

కామఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించిన 'ది కేరళ స్టోరీ 2: గోస్ బియాండ్' మూవీ బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది. సుమారు రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రం ఫిబ్రవరి 27న విడుదలైంది. దీనికి విపుల్ అమృత్ లాల్ షా ప్రొడ్యూసర్. ఈ సినిమాకు ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీని జనాలు పట్టించుకోవడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

కేరళ స్టోరీ 2 సినిమాకు ఫస్ట్ డే కలెక్షన్లు దారుణంగా ఉన్నాయి. ట్రేడ్ అనలిస్ట్ వెబ్ సైట్ సక్నిల...