భారతదేశం, జూన్ 2 -- 2026 నైరుతి రుతపవనాలు.. దేశంలోకి వచ్చేందుకు మొండికేస్తున్నాయి! వాస్తవానికి మే 26నే రుతపవనాలు కేరళను తాకాల్సి ఉంది. కానీ ప్రతికూల పరిస్థితుల కారణంగా అలా జరగలేదు. అనంతరం, జూన్ 3న మాన్​సూన్ కేరళలోకి వచ్చే అవకాశం ఉందని ఐఎండీ (భారత వాతావరణశాఖ) అంచనా వేసింది. కానీ ఇప్పుడు, 3వ తేదీన కూడా రుతుపవనాలు ఎంట్రీ ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది. జూన్​ 4 తర్వాతే అవి కేరళను తాకొచ్చని సమాచారం.

అంతేకాదు, బలమైన గాలి వ్యవస్థలు లోపించడం వల్ల ప్రారంభంలో ఈ రుతుపవనాల విస్తరణ చాలా నెమ్మదిగా, బలహీనంగా ఉండవచ్చని ఐఎండీ వెదర్ మోడల్స్ సూచిస్తున్నాయి. దీనికి తోడు, పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో పరిస్థితులు బలపడుతుండటంతో ఈ ఏడాది దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం (90% ఎల్​పీఏ) నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది.

భారత వాతావరణ శ...