భారతదేశం, మే 18 -- Keerthy Suresh: సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ తోపాటు ఆ వెనుకే ఉండే ఒత్తిళ్లు, విమర్శలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హీరోయిన్ల శరీరాకృతిపై సోషల్ మీడియాలో నెటిజన్లు చేసే కామెంట్లు ఒక్కోసారి హద్దులు దాటుతుంటాయి. తాజాగా 'మహానటి' కీర్తి సురేష్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక సుదీర్ఘమైన పోస్ట్ ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తన కెరీర్‌లో ఎదుర్కొన్న బాడీ షేమింగ్, ప్లాస్టిక్ సర్జరీ పుకార్లపై ఆమె తొలిసారి బహిరంగంగా స్పందించారు. జిమ్‌లో తను కష్టపడుతున్న పాత వీడియోలను షేర్ చేస్తూ భావోద్వేగ నోట్ రాశారు.

కీర్తి సురేష్ తన ఫిట్‌నెస్ జర్నీ గురించి వివరిస్తూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. "2013లో నేను నటిగా కెరీర్ ప్రారంభించినప్పుడు నాకేమీ తెలియదు. చాలా మందిలాగే జిమ్ నాకు సెట్ కాదనుకున్నా. నా శరీరానికి ...