భారతదేశం, సెప్టెంబర్ 1 -- Kavya Kalyanram: చైల్డ్ ఆర్టిస్ట్‌గా 'గంగోత్రి' చిత్రంలో అలరించి, 'బలగం' సినిమాలో హీరోయిన్ గా అదరగొట్టిన కావ్య కళ్యాణ్ రామ్ ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ గా మారింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్. కీరవాణి పెద్ద కుమారుడు, యువ సంగీత దర్శకుడు కాలభైరవతో ఆమె లవ్ లో ఉండటమే కారణం. త్వరలోనే వీళ్లు పెళ్లి చేసుకోబోతున్నారు.

కావ్య కళ్యాణ్ రామ్- కాళ భైరవ లవ్ విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ వార్త బయటకు రావడంతోనే సినీ లవర్స్ లో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. కావ్య కళ్యాణ్‌ రామ్ 'ఉస్తాద్' చిత్రంలో కాలభైరవ తమ్ముడు శ్రీసింహా కోడూరి సరసన హీరోయిన్ గా నటించింది.

​వెండితెరపై తమ్ముడితో జంటగా కనిపించిన కావ్య, నిజ జీవితంలో మాత్రం అన్న కాలభైరవతో ఏడడుగులు వేస్తుండటం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఒక హీరోతో సినిమా చేసి, ఆ తర్వా...