భారతదేశం, నవంబర్ 21 -- Kavya Anirudh Reception: దక్షిణాది సినీ, రాజకీయ, వ్యాపార వర్గాల్లో ఎంతో ఆసక్తిని రేకెత్తించిన కావ్య మారన్, అనిరుధ్ రవిచందర్ వెడ్డింగ్ రిసెప్షన్ ఇవాళ (నవంబర్ 21) గ్రాండ్ గా జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్, సెన్సేషనల్ సంగీత దర్శకుడు అనిరుధ్ ఒక్కటైన శుభసందర్భంగా ఏర్పాటు చేసిన ఈ వేడుక అతిరథ మహారథుల సమక్షంలో అట్టహాసంగా సాగింది.

కావ్య మారన్, అనిరుధ్ రవిచందర్ రిసెప్షన్ వేడుకకు రాజకీయ రంగం నుంచి అగ్ర నేతలు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తమిళనాడు సీఎం విజయ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ స్వయంగా విచ్చేసి కావ్య మారన్, అనిరుధ్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు రాజకీయ వర్గాల్లో ఈ నేతల హాజరు హాట్ టాపిక్‌గా మారింది.

మరోవ...