భారతదేశం, జూన్ 12 -- Karuppu OTT: కోలీవుడ్ స్టార్ సూర్య, త్రిష కాంబినేషన్‌లో సరికొత్త రికార్డులు సృష్టించిన ఫాంటసీ కోర్టురూమ్ డ్రామా 'కరుప్పు' ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులో 'వీరభద్రుడు' (Veerabhadrudu) పేరుతో రిలీజైన ఈ మూవీ ఇవాళ (జూన్ 12) డిజిటల్ స్ట్రీమింగ్ లో అడుగుపెట్టింది.

కొంతకాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరో సూర్యకు బ్లాక్ బస్టర్ అందించిన మూవీ 'కరుప్పు'. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇప్పుడీ సూపర్ హిట్ చిత్రం ఓటీటీలో అడుగుపెట్టింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. తెలుగులో వీరభద్రుడు పేరుతో స్ట్రీమింగ్ అవుతోంది.

థియేటర్లలో రూ. 304 కోట్లు కొల్లగొట్టి, ఇంకా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న కరుప్పు సినిమాను కేవలం 4 వారాల్లోనే ఓటీటీలోకి తీసుకొచ్చారు. దీని వెనుక ఉన్న అసలు ట్రేడ...