భారతదేశం, మే 14 -- Karuppu: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, త్రిష జంటగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం 'కరుప్పు' (Karuppu) విడుదల రోజునే ఊహించని వివాదంలో చిక్కుకుంది. గురువారం (మే 14) ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సిన ఈ సినిమా షోలు సౌత్ ఇండియాలో ఆకస్మికంగా రద్దు కావడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే అదే సమయంలో ముంబై, పూణే వంటి నగరాల్లో షోలు పడటం ఇప్పుడు ఇండస్ట్రీలో పెను సంచలనంగా మారింది.

దాదాపు రూ.140 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన 'కరుప్పు' మూవీ ఆర్థిక కారణాల వల్ల విడుదల ఆగిపోయిందనే వార్తలు వచ్చాయి. దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో షోలన్నీ క్యాన్సిల్ అయ్యాయి. కానీ ఉత్తరాదిలోని ముంబై, పూణే, వారణాసి వంటి నగరాల్లో మాత్రం థియేటర్లలో సినిమా ప్రదర్శితమైంది.

అక్కడ సినిమా చూస్తున్న ప్రేక్షకులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మేకర...