భారతదేశం, నవంబర్ 3 -- కార్తీక పౌర్ణమికి ఉన్న విశిష్టత చెప్పకుంటే చాలా ఉంది. కార్తీక పౌర్ణమి నాడు భక్తిశ్రద్ధతో వ్రతాలు, నోములు చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది. అలాగే కార్తీక మాసంలో నది స్నానం, దీపారాధన ఇవన్నీ కూడా విశేష ఫలితాలను తీసుకువస్తాయి. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఆ రోజున గంగా స్నానాలకు ఎంతో పవిత్రత ఉంది.

గంగా నదిలో స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయి, కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి. ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి నవంబర్ 5న వచ్చింది. కార్తీక పౌర్ణమి నాడు శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు. దేవతలను ఆ రాక్షసుడి దురాగతాల నుంచి విముక్తి కల్పించాడు. దీంతో దేవతలందరూ సంతోషంతో శివుడికి దీపాలు వెలిగించారు. ఈ రోజున చేసే దీపారాధనకు ఎంతో విశిష్టత ఉంది. దీపదానం చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుందని అగ్నిపురాణంలో చ...