భారతదేశం, నవంబర్ 5 -- ఈరోజు కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి వేళ విశేషమైన రాజయోగాలు ఏర్పడడంతో ఈరోజు ప్రత్యేకత మరింత పెరిగింది. కార్తీక పౌర్ణమి ప్రతి ఒక్కరికి చాలా ప్రత్యేకమైనది. ఈరోజు 365 వత్తులను వెలిగిస్తారు. ఈరోజు కార్తీక పౌర్ణమి వేళ అనేక శుభయోగాలు ఏర్పడడం జరిగింది. దీంతో కొన్ని రాశుల వారికి శుభయోగాల కారణంగా మంచి ఫలితాలు ఎదురవుతాయి. జీవితంలో చాలా మార్పులు ఉంటాయి, అనేక విధాలుగా కలిసివస్తుంది. మరి ఈ శుభయోగాల వేళ ఏ రాశుల వారికి బాగా కలిసి వస్తుంది? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు? ఇప్పుడు తెలుసుకుందాం.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, కొన్ని గ్రహాల సంచారంలో మార్పు అనేక విధాలుగా ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభావితం చేస్తుంది. ద్వాదశ రాశుల వారి జీవితంలో కూడా అనేక మార్పులు వస్తాయి. ఈరోజు నవంబర్ 5న చంద్రుడు మేషరాశిలోకి, గురువు కర్కాటక రాశిల...