భారతదేశం, మే 10 -- Karthika Deepam Seetha: తెలుగు రాష్ట్రాల్లో ప్రసారమవుతున్న పాపులర్ సీరియల్స్ లో కార్తీక దీపం 2 ఒకటి. ఈ సీరియల్ రేటింగ్ లో టాప్ లో దూసుకెళ్తోంది. ఈ సీరియల్ లో సుమిత్ర క్యారెక్టర్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది సీత. అయితే ఆమె జీవితంలో సీరియల్ ను మించిన కష్టాలున్నాయి. మనసును మెలిపెట్టే ఆ బాధను ఆమె తాజాగా షేర్ చేసుకుంది.

కార్తీక దీపం సీత ఇటీవల మతం మార్చుకుందనే వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ నేపథ్యంలో తన గతం గురించి ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. తన మాజీ భర్త పెట్టిన బాధలను చెప్పుకొచ్చింది. ''నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. పెళ్లి చేసుకుందాం అన్నాడు. ఇల్లు ఈఎంఐ కడుతున్నా, రెండేళ్లు ఆగమని చెప్పా. కానీ ఇంట్లో వాళ్లు మనకు పెళ్లి చేయరని చెప్పేవాడు'' అని సీత తెలిపింది.

''ఇంత పెరిగినా నాకు ఇంకా మెచ్యూరిటీ రాలేదు. ఎవర...