భారతదేశం, ఏప్రిల్ 13 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ మంచి రసపట్టుగా సాగుతోంది. బావ కావాలంటూ జ్యోత్స్న పట్టుబడుతోంది. దీంతో జ్యోత్స్నపై దీప ఆవేశంతో ఊగిపోతోంది. కార్తీక్ కోసం దీప, జ్యోత్స్న మధ్య పోరు ఇంట్రెస్టింగ్ గా మారింది. మరి కార్తీక దీపం 2 టుడే ఏప్రిల్ 13వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇక్కడ చూద్దాం.

పెళ్లి రోజున సంతోషంగా ఉండకుండా కార్తీక్ ను జ్యోత్స్న ఎక్కడెక్కడ తిప్పుతుందోనని కాంచన ఆలోచిస్తుంది. అప్పుడే చూస్తే దీప ఇంట్లో ఉండదు. రాత్రి దీప ఎక్కడికి వెళ్లిందోనని కాంచన కంగారు పడుతుంది. మరోవైపు కార్లో కార్తీక్ కు జ్యోత్స్న కౌంటర్లు వేస్తుంది. దీప ఏడుస్తూ కూర్చుంటుందని జ్యో అంటుంది.

అదే టైమ్ లో కారుకు అడ్డంగా స్కూటీపై కూర్చుని దీప అదిరే ఎంట్రీ ఇస్తుంది. వీళ్లిద్దరి మధ్య యుద్ధం జరగకుండా చైనా వాల్ లా అడ్డుపడాలని కార్తీ...