భారతదేశం, మార్చి 23 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే మార్చి 23 ఎపిసోడ్ లో.. సుమిత్రకు పారిజాతం దిష్టి తీసి ఆహ్వానిస్తుంది. మళ్లీ ఈ ఇంట్లో అడుగుపెడతానని అనుకోలేదని దశరథతో సుమిత్ర అంటుంది. నీ కోసం దశరథ హోమం చేయించాడు. మీ మామయ్య బలంగా కోరుకున్నాడు. జ్యోత్స్న నిన్ను కాపాడిందని పారిజాతం అంటుంది.

ఇంజెక్షన్ అంటేనే భయపడే నా కూతురు ఇంత పెద్ద ఆపరేషన్ కు ముందుకు వచ్చిందంటే తల్లి కోసమే కదా అని జ్యోత్స్న చేతులు పట్టుకుని సుమిత్ర కన్నీళ్లు పెట్టుకుంటుంది. నీ కూతురు గండాన్ని దాటించిందని శివ నారాయణ అంటాడు. నేను ఏదైతే నమ్మలేదో అదే ఇప్పుడు నమ్మాల్సి వస్తుంది. నేను సుమిత్ర కూతురిని. ఈ గ్రానీ తప్పు దారి పట్టించిందని జ్యోత్స్న అనుకుంటుంది.

చిన్న పని ఉంది బయటకు వెళ్లొస్తానని దశరథ అంటే, ఎవరూ ఎక్కడికి వెళ్లొద్దని సుమిత్ర అడుగుతుంది. భార్యకు నచ్చజెప్పి లోపలికి దశ...