భారతదేశం, మార్చి 9 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే మార్చి 9 ఎపిసోడ్ లో అమ్మానాన్న ఎప్పుడు వస్తారని నానమ్మ కాంచనను శౌర్య అడుగుతుంది. నువ్వు మారిపోయావ్ నానమ్మ. చెల్లి పుడితే నన్ను హాస్టల్లో వేస్తారా? నన్ను ఇంట్లో నుంచి పంపిస్తావా? చెల్లి వస్తే నా మీద ప్రేమ పోతుందా? అని కాంచనను శౌర్య అడుగుతుంది. ఎంతమంది ఉన్నా నువ్వే నా ఫస్ట్ అని శౌర్యను కాంచన దగ్గరకు తీసుకుని ముద్దు పెడుతుంది.

అప్పుడే కార్తీక్ వస్తాడు. అమ్మ ఎక్కడ అని శౌర్య అడుగుతుంది. ఏం చెప్పాలో అని కార్తీక్ ఆలోచిస్తాడు. అప్పుడు శౌర్యనే ఓ తాత ఇంటి దగ్గర ఉండిపోయిందా? అని అంటుంది. హా అవును.. తాత ఇంటి దగ్గరే ఉండిపోయింది. అమ్మమ్మకు ఆరోగ్యం బాలేదు కదా అందుకే అక్కడే ఉండిపోయిందని కార్తీక్ అబద్దం చెప్తాడు. ఈ రోజు నుంచి నేను చెప్పేంతవరకు నువ్వు నానమ్మతోనే ఉండాలని బిడ్డకు కార్తీక్ చెప్తాడు.

దీపను హా...