భారతదేశం, ఏప్రిల్ 16 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ లో జ్యోత్స్న మెడలో కార్తీక్ తాళి కట్టినట్లు కాంచన కల కనడంతో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కల నిజం అవుతుందేమోనని కాంచన భయపడుతుంది. మరోవైపు బావను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని జ్యోత్స్న అనుకుంటుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో కార్తీక్ దీపం 2 టుడే ఏప్రిల్ 16 ఎపిసోడ్ లో చూద్దాం.

కాంచనకు వచ్చిన కల గురించి కార్తీక్ మాట్లాడుతుంటే దీప కోపంతో వెళ్లిపోతుంది. ఎందుకు చెప్పావమ్మా అని కార్తీక్ అడిగితే తప్పంతా నాదేరా అంటూ కాంచన కూడా లోపలికి వెళ్లిపోతుంది. తల్లి, భార్య ఎందుకు అలుగుతారో తెలియదు. మనం ఏ తప్పు చేయకున్నా సారీ చెప్పాల్సిందేనని కొడుక్కి శ్రీధర్ హితబోధ చేస్తాడు.

బావతో మెడలో తాళి కట్టించుకుంటానని జ్యోత్స్న చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఈ గంగా...