భారతదేశం, నవంబర్ 3 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. నాసిరకం సరుకులతో జ్యోత్స్న రెస్టారెంట్ ఇమేజ్ డ్యామేజ్ చేయాలని మాలిని కుట్ర పన్నుతోంది. కానీ అలా జరగకుండా సీఈఓ దీప బాధ్యత తీసుకుంటుంది. ఆర్డర్ తాను డెలివరీ చేస్తానంటుంది. తానే వంట చేస్తానని సూరజ్ కు చెప్తుంది.

సీఈఓ గారు ఇది మీ ఇంట్లో నలుగురికి వంట చేయడం కాదని సూరజ్ సెటైర్ వేస్తాడు. నేను చేయాలనుకుంటే వెయ్యి కాదు పది వేలు అయినా ఓకేనని దీప నమ్మకంతో చెప్తుంది. నేను వెంటనే క్వాలిటీ మెటీరియల్ తెప్పిస్తా. నాతో పాటు వంట చేయడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారని దీప అడిగితే ఎవరూ చప్పుడు చేయరు. అప్పుడు కార్తీక్, జ్యోత్స్న మేమున్నామని అంటారు. ఆ వెంటనే స్టాఫ్ కూడా మేమున్నామని అరుస్తారు.

మరోవైపు ట్యూషన్ చెప్పేందుకు పార్వతి ఇంటికి దశరథ వెళ్తాడు. పిల్లలకు దశరథ పాఠా...